tag:blogger.com,1999:blog-144640692024-03-06T22:09:41.202-08:00Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతంV Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.comBlogger2367125tag:blogger.com,1999:blog-14464069.post-38640038588251497952009-11-01T14:49:00.000-08:002009-11-01T14:49:51.998-08:002_1_63 వచనము ప్రకాష్ - వసంతవచనము

అదియును నూఱుయోజనంబుల వెడల్పును నూటయేఁబది యోజనంబుల నిడుపును నేను యోజనంబుల తనర్పునుం గలిగి వైహాయసంబయి కామగమనంబయి వ్యపేతశీతాతపంబయి సకల కాల కుసుమ ఫలభరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితంబయి తపఃప్రభావంబున నమరేంద్రుచేత నిర్మితంబయి కరం బొప్పుచుండు నట్టి సభయందు.

(ఆ సభ నూరు ఆమడల వెడల్పు, నూట యాభై ఆమడల పొడవు, ఐదు ఆమడల ఎత్తు కలిగి ఆకాశంలో ఉంటుంది. అక్కడ చలి, ఎండ ఉండవు. అన్ని కాలాల్లోనూ అక్కడి సరస్సులు, చెట్ల తోపులు పూలు, పండ్లతో నిండుగా ఉంటాయి. దీన్ని ఇంద్రుడు తన తపోబలంతో నిర్మించుకున్నాడు.)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com3tag:blogger.com,1999:blog-14464069.post-46547469020155031552009-09-22T01:00:00.000-07:002009-09-22T01:00:54.703-07:002_1_62 కందము ప్రకాష్ - వసంతకందము

శతమఖు సభ శుభ రత్నాం

చిత కాంచన రచిత మతి విచిత్రము లోక

త్రితయాఖిల లక్ష్మీ సం

శ్రిత మలవియె దానిఁ బొగడ శేషున కయినన్.

(ఇంద్రసభ ఎంతో వైభవంగా ఉంటుంది. దానిని పొగడటం ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-15245420949114578442009-09-22T00:56:00.001-07:002009-09-22T00:56:42.376-07:00-:ఇంద్రసభావర్ణనము:-V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-52203911253868157922009-09-22T00:53:00.000-07:002009-09-22T00:53:03.386-07:002_1_61 వచనము ప్రకాష్ - వసంతవచనము

అనిన విని 'యవి యెట్టివి? వాని వినవలతు నానతిం' డని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత కుతూహల చేతస్కుండై యడిగిన ధర్మరాజునకు నారదుం డిట్లనియె.

(దిక్పాలకుల సభలు ఎలా ఉంటాయో చెప్పమని ధర్మరాజు కుతూహలంతో నారదుడిని అడిగాడు.)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com2tag:blogger.com,1999:blog-14464069.post-87987572769577360972009-09-19T15:18:00.000-07:002009-09-19T15:18:50.908-07:002_1_60 కందము వోలం - వసంతకందము

సురపతి యమ వరుణ ధనే

శ్వర కమలాసనుల దివ్యసభలెల్ల నరే

శ్వర! చూచితి నవి దీనికి

సరిగా వత్యంతవిభవ సౌందర్యములన్.

(ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల సభలన్నీ చూశాను. ఐశ్వర్యంలో, సౌందర్యంలో అవి దీనికి సరితూగవు.)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com3tag:blogger.com,1999:blog-14464069.post-50209851165106869702009-09-19T15:15:00.000-07:002009-09-19T15:15:53.407-07:002_1_59 కందము వోలం - వసంతకందము

భూనాథ! యిది యపూర్వ మ

మానుషము విచిత్ర రత్నమయ మిట్టి సభన్

మానవలోకేశ్వరులం

దే నెన్నఁడుఁ జూచి వినియి నెఱుఁగ ధరిత్రిన్.

(మహారాజా! ఈ సభ అపూర్వం, మానవాతీతం, విచిత్రరత్నమయం. మానవలోకం లోని రాజుల దగ్గర ఇలాంటి సభను నేను ఎప్పుడూ చూసి, విని ఎరుగను.)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-75922659905934480112009-09-19T15:11:00.000-07:002009-09-19T15:11:15.165-07:002_1_58 వచనం వోలం - వసంతవచనం

అని కృతాంజలి యయి 'మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లేవెందే నిట్టి యపూర్వంబైన సభ చూచి యెఱుంగుదురే?' యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు ధర్మరాజున కి ట్లనియె.

(అని, "మునీంద్రా! ఈ మూడులోకాల్లో మీరు చూడనివి లేవు. ఎక్కడైనా ఇలాంటి అపూర్వమైన సభను చూశారా?", అని మయుడు నిర్మించిన ఆ సభను చూపించగా నారదుడు ఆశ్చర్యపోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు.)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-82552168625502442402009-09-19T15:06:00.001-07:002009-09-19T15:06:52.363-07:00-:ఇట్టి సభ నెచ్చటనైనఁ జూచితిరా యని ధర్మజుఁడు నారదు నడుగుట:-V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-30596147724406795592009-09-19T15:05:00.000-07:002009-09-19T15:05:20.809-07:002_1_57 తేటగీతి వోలం - వసంతతేటగీతి

నాయథాశక్తిఁ జేసి యన్యాయపథముఁ

బరిహరించి మహాత్ముల చరితలందు

బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు

లయిన వాని ననుష్ఠింతుఁ బ్రియముతోడ.

(నాకు చేతనైనంతవరకు అన్యాయమార్గం వదిలి, మహాత్ముల చరితలపై బుద్ధినిలిపి మీ ఉపదేశం వల్ల మంచి పనులు ఆచరిస్తాను.)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-802243511173283822009-05-30T17:17:00.000-07:002009-05-30T17:17:18.471-07:002_1_56 వచనం వోలం - వసంతవచనం

మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం బనర్థజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ

సూత్ర్తత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబుల యందనర్థకచింత నిశ్చిత కార్యంబులు సేయమి మంత్రంబుల

రక్షింపమి శుభంబులఁ బ్రయోగింపమి విషయంబులం దగులుట యనంబరఁగిన పదునాలుఁగు

రాజదోషంబులఁ బరిహరింతె యని యడిగిన నారదునకు ధర్మరా జిట్లనియె.

(నాస్తికత, అబద్ధమాడటం, ఏమరుపాటు, సోమరితనం, తెలివితక్కువవాళ్లతో కార్యాలోచన చేయటం, కోపం, ఎక్కువకాలం చింతించటం, చేయవలసిన పనిగురించి ఎక్కువకాలం ఆలోచించటం, ఆలస్యంగా చేయటం, జ్ఢానులను గుర్తించకపోవటం, ప్రయోజనకరమైన విషయాల్లో ప్రయోజనం లేని ఆలోచనలు చేయటం, నిర్ణయించిన పనులు చేయకపోవటం, రహస్యాలు కాపాడుకోలేకపోవటం, శుభకార్యాలు చేయకపోవటం, ఇంద్రియలోలత్వం - అనే పదునాలుగు రాజదోషాలను విడిచిపెట్టావు కదా అన్న నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-54309728093320056152009-05-25T15:14:00.000-07:002009-05-25T15:16:47.006-07:002_1_55 తేటగీతి వోలం - వసంతతేటగీతి

కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగి యున్న
నీకు ముందఱఁ జని రిపు నృపులయందు
దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర
యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.

(నువ్వు శత్రురాజులపై దండెత్తటానికి ముందే సామదానభేదదండోపాయాలను ప్రయోగిస్తున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-31323033118063841052009-05-25T15:06:00.000-07:002009-05-25T15:14:04.584-07:002_1_54 చంపకమాల వోలం - వసంతచంపకమాల

వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై
మొదలన దేశకాలబలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ
విదిత బలుండవై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు
ర్మద మలినాంధ చిత్తులఁ బ్రమత్తుల నింద్రియ నిర్జితాత్ములన్.

(నీ మనసులోని శత్రువులను, ఇంద్రియాలను జయించి, బయటి శత్రువులను జయించాలనే ఉద్దేశంతో ఉన్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-68592510104815403502009-05-21T00:07:00.000-07:002009-05-21T00:07:30.628-07:002_1_53 చంపకమాల వోలం - వసంతచంపకమాల

బహుధనధాన్య సంగ్రహము బాణశరాసన యోధవీర సం

గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘ సం

గ్రహము ననేక యంత్రములుఁ గల్గి యసాధ్యములై ద్విషద్భయా

వహు లగుచుండ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్

(నీ కోటలన్నీ ధనధాన్యాలు, ధనుర్బాణాలు, వీరులు, నీళ్లు, గడ్డి, ఉప్పు, పులుపు, కారం వంటి ఆహారపదార్థాలు, పానీయాలు, వంటకట్టెలు, యంత్రాలు మొదలైనవి సమృద్ధిగా కలిగి దుర్భేద్యాలై ఉన్నాయి కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-80525685224297151692009-05-19T23:46:00.000-07:002009-05-19T23:46:33.836-07:002_1_52 ఆటవెలది వోలం - వసంతఆటవెలది

దార సంగ్రహంబు ధరణీశ! రతి పుత్త్రఫలము

శీలవృత్త ఫలము శ్రుతము

దత్తభుక్తఫలము ధనము వేదము లగ్ని

హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు

(భార్యను పొందటానికి ఫలం - రతి, పుత్రులు. ధర్మాలను గురించి వినటానికి ఫలం - సచ్ఛీలం. సంపాదించిన ధనానికి ఫలం - దానం చెయ్యటం, అనుభవించటం. వేదాలకు ఫలం - అగ్నిహోత్రాలు)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-68939577893873149112009-05-18T20:48:00.000-07:002009-05-18T20:51:52.211-07:002_1_51 ఆటవెలది వోలం - వసంతఆటవెలది

వార్తయంద జగము వర్తిల్లుచున్నది
యదియు లేని నాఁడ యఖిల జనులు
నంధకారమగ్ను లగుదురు గావున
వార్త నిర్వహింపవలయుఁ బతికి.

(ప్రపంచం వార్త మీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలు అంధకారంలో మునిగినట్లే. కాబట్టి ప్రభువు వార్తను బాగా నడపాలి.)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14464069.post-91430196233487287902009-05-18T20:27:00.000-07:002009-05-18T20:38:39.751-07:002_1_50 కందము వోలం - వసంతకందము

వెలయఁగ విద్వజ్జన ము

ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి

మ్ముల లోక వ్యవహార

మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.

(రోజూ పండితులతో కలిసి లోకవ్యవహారాలు విచారిస్తున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-42085511913170442542008-08-10T20:50:00.000-07:002008-08-10T20:56:15.984-07:002_1_49 కందము వోలం - వసంతకందము

పరికించుచు బాహాభ్యం
తర జనములవలన సంతతము నిజరక్షా
పరుఁ డవయి పరమహీశుల
చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్

(శత్రువులనుంచి నిన్ను నువ్వు రక్షించుకుంటూ, గూఢచారుల ద్వారా వారి ప్రవర్తనను గమనిస్తున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-51482273867855485912008-07-23T21:30:00.000-07:002008-07-23T21:39:07.768-07:002_1_48 కందము వోలం - వసంతకందము

వలయు నమాత్యులుఁ జుట్టం
బులు మూలబలంబు రాజపుత్త్రులు విద్వాం
సులు బలసియుండ నిచ్చలుఁ
గొలువుండుదె లోక మెల్లఁ గొనియాడంగన్

(నీకు ఇష్టమైనవారు ఆసీనులై ఉండగా రోజూ కొలువుదీరుతున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-2586519574703228902008-07-23T21:13:00.000-07:002008-07-23T21:29:40.710-07:002_1_47 సీసము + ఆటవెలది వోలం - వసంతసీసము

ఆయంబునందు నాలవ భాగమొండె మూఁ
డవ భాగమొండె నం దర్ధమొండె
గాని మిక్కిలి సేయఁగాదు వ్యయంబని
యవధరించితె బుద్ధి నవనినాథ !
యాయుధాగారధనాధ్యక్ష్యములయందు
వరవాజి వారణావళులయందు
బండారములయందుఁ బరమ విశ్వాసుల
భక్తుల దక్షులఁ బంచితయ్య

ఆటవెలది

గురుల వృద్ధ శిల్పివరవణి గ్భాంధవ
జనుల నాశ్రితులను సాధుజనులఁ
గరుణఁ బేదఱికము వొరయకుండఁగఁ బ్రోతె
సకలజనులు నిన్ను సంస్తుతింప

(ఆదాయంలో సగానికి మించి ఖర్చుచేయకూడదని గ్రహించావు కదా! ముఖ్యమైన ఉద్యోగాలలో సమర్థులను నియమించావు కదా! ప్రజల్ని దయతో పోషిస్తున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-76243822389573776592008-07-16T20:17:00.001-07:002008-07-16T20:18:22.965-07:002_1_46 కందము వోలం - వసంతకందము

కృత మెఱిఁగి కర్త నుత్తమ
మతుల సభల సంస్తుతించి మఱవక తగు స
త్కృతి సేయుదె కృత మెఱిఁగెడు
పతియె జగజ్జనుల నెల్లఁ బరిపాలించున్.

(మేలు చేసిన వారిని గుర్తిస్తున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-29471315783902493142008-03-12T19:45:00.000-07:002008-03-12T19:49:46.437-07:002_1_45 కందము వోలం - వసంతకందము

పంగుల మూకాంధుల విక
లాంగులను నబాంధవుల దయం బ్రోతె భయా
ర్తుం గడిఁది శత్రునైనను
సంగరరంగమునఁ గాతె శరణం బనినన్.

(కుంటివారిని, మూగవారిని, గుడ్డివారిని, వికలాంగులను, అనాథులను దయతో పోషిస్తున్నావు కదా! శరణుకోరితే శత్రువును కూడా కాపాడుతున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-10719765820970640012008-03-11T20:10:00.000-07:002008-03-11T20:14:50.120-07:002_1_44 కందము వోలం - వసంతకందము

హీనులగు కర్షకులను
భూనుత! ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న
నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్.

(పేద రైతులకు విత్తనాలూ, వర్తకులకు నూటికి ఒక రూపాయి వడ్డీ వంతున అప్పులూ ఇస్తున్నావు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com2tag:blogger.com,1999:blog-14464069.post-91948131399847565902008-03-11T20:06:00.000-07:002008-03-11T20:10:16.194-07:002_1_43 కందము వోలం - వసంతకందము

ధరణీనాథ భవద్భుజ
పరిపాలితయైన వసుధఁ బరిపూర్ణములై
కర మొప్పుచున్నె చెఱువులు
ధరణి కవగ్రహభయంబు దనుకక యుండన్.

(రాజా! నీ రాజ్యంలోని చెరువులు అనావృష్టి భయంలేకుండా నిండుగా ఉన్నాయి కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14464069.post-28212035749931466422008-03-10T20:49:00.000-07:002008-03-10T20:55:51.614-07:002_1_42 కందము వోలం - వసంతకందము

చోర భయ వర్జితముగా
ధారుణిఁ బాలింతె యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా
వారలచే ధనముగొని భవద్భృత్యవరుల్.

(రాజ్యంలో దొంగల భయం లేకుండా పాలిస్తున్నావు కదా! నీ సేవకులు దొంగల దగ్గర డబ్బు పుచ్చుకొని వాళ్లని రక్షించటం లేదు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com2tag:blogger.com,1999:blog-14464069.post-15658750097566103792008-03-09T21:47:00.000-07:002008-03-09T21:49:34.055-07:002_1_41 కందము వోలం - వసంతకందము

ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ
ర్పని వారలఁ బగఱవలని వారల ధృతి చా
లని వారల దుర్జనులం
బనుపవుగా రాజకార్యభారము దాల్పన్.

(రాజకార్యాలకు చెడ్డవారిని పంపటం లేదు కదా!)V Ghttp://www.blogger.com/profile/13909682172390352307noreply@blogger.com0