Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Friday, August 11, 2006
1_6_185 కందము జ్యోతి - విజయ్
కందము
ఆ కాననాంతరంబునఁ
బ్రాకటభుజవిక్రముండు పాండవవజ్ర
ప్రాకారుఁడు జాగరమున
శోకమనస్కుఁ డయి పవనసూనుం డుండెన్.
(ఆ అడవిమధ్యలో, పాండవులకు వజ్రపు ప్రహరీ గోడ లాంటివాడైన భీముడు దుఃఖంతో కూడిన మనసుతో మెలకువగా ఉన్నాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment