Sunday, October 22, 2006

1_7_179 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్ట నోపక నివృత్తు లయిరి మఱి యదు వృష్ణి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్య కర్మంబునం దనారంభు లయి మిన్నకుండి రంత శిశుపాల జరాసంధ శల్య కర్ణులు దర్పితు లై తమ తమ లావులు మెఱసి క్రమంబున నలువురు మాష యవ ముద్గ రోమ మాత్రంబులు దక్క గొనయం బెక్కించియు మోపెట్ట నశక్యంబయిన నుక్కుసెడి స్రుక్కిన వారలం జూచి యగ్రజుననుమతంబున విప్రసభ వెలువడి విజయుండు ధనుస్సమీపంబున కరిగిన నాతని యుత్సాహంబున కచ్చెరువడి కొందఱుబ్రాహ్మణులు దమలో ని ట్లనిరి.

(యదువృష్ణిభోజాంధకులు శ్రీకృష్ణుని మాట అనుసరించి ధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు. శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, కర్ణుడు క్రమంగా మినుపగింజ, యవగింజ, పెసరగింజ, వెండ్రుక - అంతమాత్రం తక్కువగా అల్లెత్రాటిని ఎక్కించి కూడా ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక వెనుదిరిగారు. అప్పుడు అర్జునుడు బ్రాహ్మణసభనుండి ధనుస్సు దగ్గరకు వెళ్లగా కొందరు బ్రాహ్మణులు ఇలా మాట్లాడుకున్నారు.)

No comments: