Wednesday, October 25, 2006

1_7_189 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

ధరణీశ నందనుల్ ద న్నతిప్రీతితోఁ
        జూచుచు నుండంగ సుందరాంగి
తోయజ దళ నేత్రి ద్రుపదరాజాత్మజ
        కమనీయ గజ రాజ గమనలీలఁ
జనుదెంచి సురరాజసన్నిభు నభినవ
        యౌవనోద్భాసితు నసితరత్న
రుచిరాంగు నంగజరూపు ధనంజయుఁ
        దనచేతి సితపుష్పదామకమునఁ

ఆటవెలది

బొలఁతి ముదముతోడఁ బూజించె నట్టియు
త్సవముఁ జూచి దాని సైఁప కపుడు
కౌరవేంద్రుఁ డాదిగాఁ గల భూపతు
లెల్ల నలిగి గలయ నేపు రేఁగి.

(అప్పుడు ద్రౌపది అర్జునుడి దగ్గరకు వచ్చి తన చేతిలోని తెల్లని పూలదండతో పూజించింది. ఈ ఉత్సవాన్ని చూసి ఓర్వలేక దుర్యోధనుడు, అతడి తోడి రాజులు, కోపంతో విజృంభించారు.)

No comments: