మత్తకోకిలము
ఏల రాఁ బనిచెన్ మహీశుల నెల్లఁ జుట్టమపోలె ము
న్నేల సత్కృతిఁ జేసె నిందఱ కిమ్మహారథు లుండఁగా
నేల కన్యక నిచ్చె విప్రున కిందు నేఁడు శఠుండు పాం
చాలుఁ డిప్పుడ వీని నిర్గతసత్త్వుఁ జేయుద మాజిలోన్.
(రాజులందరినీ ఎందుకు రప్పించాడు? ఇంతమంది ఉండగా తన కూతురిని ఒక విప్రుడికి ఎందుకు ఇచ్చాడు? ద్రుపదుడు మోసగాడు. ఇప్పుడే యుద్ధంలో ఇతడిని ఓడిద్దాం.)
Wednesday, October 25, 2006
1_7_189 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత
సీసము
ధరణీశ నందనుల్ ద న్నతిప్రీతితోఁ
జూచుచు నుండంగ సుందరాంగి
తోయజ దళ నేత్రి ద్రుపదరాజాత్మజ
కమనీయ గజ రాజ గమనలీలఁ
జనుదెంచి సురరాజసన్నిభు నభినవ
యౌవనోద్భాసితు నసితరత్న
రుచిరాంగు నంగజరూపు ధనంజయుఁ
దనచేతి సితపుష్పదామకమునఁ
ఆటవెలది
బొలఁతి ముదముతోడఁ బూజించె నట్టియు
త్సవముఁ జూచి దాని సైఁప కపుడు
కౌరవేంద్రుఁ డాదిగాఁ గల భూపతు
లెల్ల నలిగి గలయ నేపు రేఁగి.
(అప్పుడు ద్రౌపది అర్జునుడి దగ్గరకు వచ్చి తన చేతిలోని తెల్లని పూలదండతో పూజించింది. ఈ ఉత్సవాన్ని చూసి ఓర్వలేక దుర్యోధనుడు, అతడి తోడి రాజులు, కోపంతో విజృంభించారు.)

1_7_188 వచనము ప్రకాష్ - వసంత
వచనము
అ య్యవసరంబున ధర్మనందనుండు నకులసహదేవానుగమ్యమానుం డయి నిజనివాసంబునకుం జనియె నిట ధృష్టద్యుమ్న సహితుం డయి యజ్ఞసేనుండు మహాసేనతో నర్జునునకు సహాయుండుగా నరిగె నంత.
(అప్పుడు ధర్మరాజు నకులసహదేవులు వెంటరాగా ఇంటికి వెళ్లాడు. ద్రుపదుడు ధృష్టద్యుమ్నుడితో అర్జునుడికి సహాయుడిగా వెళ్లాడు.)

1_7_187 కందము ప్రకాష్ - వసంత
కందము
చలఁగె సురదుందుభి స్వన
ములు ముదమున భూసురోత్తములు పయిపుట్టం
బులు వీచివీచి యార్చిరి
వెలయఁగ నరుమీదఁ బుష్పవృష్టియుఁ గురిసెన్.
(దేవతల భేరీధ్వనులు వినిపించాయి. విప్రులు తమ ఉత్తరీయాలను వీచుతూ పెద్దగా కేకలు వేశారు. అర్జునుడిమీద పూలవాన అందంగా కురిసింది.)

1_7_186 కందము ప్రకాష్ - వసంత
కందము
అని ధరణినుండి పొగడెడు
జనుల నిరంతరరవంబు జలధరమార్గం
బున నుండి పొగడు దివ్యుల
యనవరతరవంబు నొక్కఁ డయి కడు నొప్పెన్.
(అని భూమిమీది ప్రజల ధ్వని, ఆకాశంలోని దేవతల ధ్వని కలిసి వినిపించాయి.)

Tuesday, October 24, 2006
1_7_185 కందము ప్రకాష్ - వసంత
కందము
నిమిషాంతరమున ని ట్ల
శ్రమమున మర్త్యులకు నేయ సమకూరునె యు
త్తముఁ డీతఁడు బ్రాహ్మణ రూ
పమున సురేశ్వరుఁడొ హరుఁడొ భానుఁడొ గుహుఁడో.
(మత్స్యయంత్రాన్ని క్షణకాలంలో ఇంత సునాయాసంగా కొట్టటం మనుషులకు సాధ్యమేనా? ఇతడు బ్రాహ్మణరూపంలో ఉన్న దేవేంద్రుడో, శివుడో, సూర్యుడో, కుమారస్వామియో.)

1_7_184 చంపకమాల ప్రకాష్ - వసంత
చంపకమాల
ఫలపవనాంబుభోజన శుభవ్రతవృత్తులఁ జేసి చూడ దు
ర్బలతను లయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్ మహా
బలయుతు లట్టి వారలకు భవ్యుల కెందు నసాధ్య మెద్దియుం
గలదె చరాచరాఖిలజగంబులఁ బెద్దల కారె సద్ద్విజుల్.
(తపోబలసంపద చేత మహాబలవంతులైన విప్రులకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా.)

1_7_183 వచనము ప్రకాష్ - వసంత
వచనము
అంత న య్యర్జునుండు న వ్వింటి సమీపంబునకు వచ్చి గురువులం దలంచి నమస్కారంబు సేసి ధనువునకుఁ బ్రదక్షిణంబుఁ జేసి మ్రొక్కి దాని నెత్తికొని పూర్వ పరిచితం బైన విల్లు మోపెట్టిన ట్లశ్రమంబున మోపెట్టి జను లా శ్చర్యంబునం బొందుచుండ నేనమ్ముల న మ్మత్స్యయంత్రంబు నాక్షణంబ యురుల నేసినం జూచి బ్రాహ్మణ క్షత్త్రియ ప్రముఖు లయిన జనులెల్ల విస్మితు లయి.
(అని అర్జునుడు ఆ వింటిని, అలవాటైన ధనుస్సును సంధించినట్లు సంధించి, అందరూ ఆశ్చర్యపోయేలా ఐదు బాణాలతో ఆ మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు.)

1_7_182 మత్తేభము ప్రకాష్ - వసంత
మత్తేభము
అమితోత్సాహుఁడు దీర్ఘ బాహు పరిఘుం డత్యంతతేజస్వి స
ద్విమలాచారుఁడు విప్రభక్తిపరుఁ డీ విప్రుండు విప్రప్రసా
దమునన్ విప్రుల కెల్ల సంతసముగాఁ దత్కర్మసంసిద్ధి ను
త్తముఁ డై పొందెడు మంచు నుండిరి దయన్ ధాత్రీసురుల్ ప్రీతు లై.
(ఇతడు కార్యసిద్ధి పొందుగాక - అని విప్రులు అర్జునుడి పట్ల దయతో ఉన్నారు.)

1_7_181 కందము ప్రకాష్ - వసంత
కందము
అనువారు నందుఁ గొందఱు
ఘనుఁ డీతఁడు వీరికంటెఁ గార్ముక విద్యం
దనరిన వాఁ డయు దీనికి
మొనసెంగా కన్యుఁ డిట్లు మొనయం గలఁడే.
(అని అంటూ ఉండగా, కొందరు - ఇతడు విలువిద్యలో వీళ్లకంటే నేర్పు కలవాడు. సామాన్యుడు ఈ విధంగా పూనుకొంటాడా?)

Sunday, October 22, 2006
1_7_180 ఉత్పలమాల నచకి - వసంత
ఉత్పలమాల
ఇ మ్మనుజేంద్ర నందను లహీన బలుల్ దృఢదీర్ఘ బాహువీ
ర్యమ్ముల వార లోపర శరాసన కర్మమునం దయుక్త ద
ర్పమ్మున నిప్డు నవ్వు పఱుపన్ సమకట్టె నితండు విప్రవం
శమ్మున వారినెల్లఁ దనశక్తి యెఱుంగక దుర్విదగ్ధుఁ డై.
(ఇందరు రాజులు ఈ విల్లును ఎక్కుపెట్టలేకపోయారు. ఇప్పుడు ఇతడు తన శక్తిని తెలుసుకోలేక విప్రవంశాన్ని నవ్వులపాలు చేయటానికి పూనుకొన్నాడు.)

1_7_179 వచనము నచకి - వసంత
వచనము
ఇట్లు రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్ట నోపక నివృత్తు లయిరి మఱి యదు వృష్ణి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్య కర్మంబునం దనారంభు లయి మిన్నకుండి రంత శిశుపాల జరాసంధ శల్య కర్ణులు దర్పితు లై తమ తమ లావులు మెఱసి క్రమంబున నలువురు మాష యవ ముద్గ రోమ మాత్రంబులు దక్క గొనయం బెక్కించియు మోపెట్ట నశక్యంబయిన నుక్కుసెడి స్రుక్కిన వారలం జూచి యగ్రజుననుమతంబున విప్రసభ వెలువడి విజయుండు ధనుస్సమీపంబున కరిగిన నాతని యుత్సాహంబున కచ్చెరువడి కొందఱుబ్రాహ్మణులు దమలో ని ట్లనిరి.
(యదువృష్ణిభోజాంధకులు శ్రీకృష్ణుని మాట అనుసరించి ధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు. శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, కర్ణుడు క్రమంగా మినుపగింజ, యవగింజ, పెసరగింజ, వెండ్రుక - అంతమాత్రం తక్కువగా అల్లెత్రాటిని ఎక్కించి కూడా ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక వెనుదిరిగారు. అప్పుడు అర్జునుడు బ్రాహ్మణసభనుండి ధనుస్సు దగ్గరకు వెళ్లగా కొందరు బ్రాహ్మణులు ఇలా మాట్లాడుకున్నారు.)

1_7_178 మత్తేభము నచకి - వసంత
మత్తేభము
ఇది యెట్లున్ సమకూర దెవ్వరికి ము న్నీ విల్లు మోపెట్టఁ బో
లదు మోపెట్టియు నంతరిక్షమున నా లక్ష్యంబు భేదింపఁగా
నది బ్రహ్మాదుల కైన నిం దలవిగా దంచున్ విచారించి ని
ర్మదు లై కొందఱురాజు లేఁగిరి నిజక్ష్మామార్గముల్ చూచుచున్.
(ఈ ద్రౌపది ఎవరికీ లభించదు. ఈ విల్లు ఎక్కుపెట్టటమే సాధ్యం కాదు. ఎక్కుపెట్టినా మత్స్యయంత్రాన్ని కొట్టటం సాధ్యం కాదు - అని ఆలోచించి కొందరు రాజులు తమ ఊరి దారి పట్టారు.)

1_7_177 కందము నచకి - వసంత
కందము
బలవంతుల బలమఱఁగా
మలువక మ్రాన్మ్రానిపాట మాయాధను వి
మ్ములఁ జేసిన మోపెట్టఁగఁ
గొలఁదియె యని డాయ రైరి కొందఱు దానిన్.
(కొందరు దాని దగ్గరకే పోలేదు.)
బలవంతుల బలమఱఁగా
మలువక మ్రాన్మ్రానిపాట మాయాధను వి
మ్ములఁ జేసిన మోపెట్టఁగఁ
గొలఁదియె యని డాయ రైరి కొందఱు దానిన్.
(కొందరు దాని దగ్గరకే పోలేదు.)
1_7_176 కందము నచకి - వసంత
కందము
వడి నౌడు గఱచి వలకేల్
నిడుచన గనయమునఁ బెనఁచి నీల్గి బలం బే
ర్పడ విల్లు వంపనోపక
యుడిగిరి నృపసుతులు గొంద ఱొయ్యన లజ్జన్.
(రాజకుమారులు ఆ వింటిని వంచలేక తమ ప్రయత్నాలు మానుకున్నారు.)

Subscribe to:
Posts (Atom)