Tuesday, October 04, 2005

1_2_30 వచనము ప్రదీప్ - విజయ్

వచనము

కని కద్రువ వినతం జూచి చూడవె యల్ల యతిధవళంబైన యశ్వంబునందు
సంపూర్ణచంద్రునందు నల్లయుంబోలె వాలప్రదేశంబునందు నల్లయై
యున్నది యనిన విని వినత నగి నీ వేకన్నులం జూచితె యక్క యెక్కడిది
నల్ల యీయశ్వరాజుమూర్తి మహాపురుషకీర్తియుంబోలె నతినిర్మలంబై
యొప్పుచున్నయది యనిన విని నవ్వి వినతకుఁ గద్రువ యిట్లనియె.

(ఆ గుర్రాన్ని చూసి కద్రువ వినతతో, "చూడవే, తెల్లని ఆ గుర్రానికి చంద్రుడికి మచ్చలా తోక నల్లగా ఉంది", అన్నది. అప్పుడు వినత, "అక్కా! మచ్చ ఎక్కడిది? గుర్రం తెల్లగానే ఉంది", అనగా కద్రువ వినతతో ఇలా అన్నది.)

No comments: