Wednesday, October 05, 2005

1_2_37 ఉత్పలమాల కృష్ణ - విక్రమాదిత్య

ఉత్పలమాల

ఆతతపక్షమారుతరయప్రవికంపిత ఘూర్ణితాచల
వ్రాతమహార్ణవుండు బలవన్నిజదేహసముజ్జ్వల ప్రభా
ధూతపతంగతేజుఁ డుదితుం డయి తార్క్ష్యుఁ డు తల్లికిన్ మనః
ప్రీతి యొనర్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీథికిన్.

(మహాబలవంతుడైన గరుత్మంతుడు జన్మించి తల్లికి ఆనందం కలిగించేలా ఆకాశంలోకి ఎగిరాడు.)

No comments: