Sunday, October 02, 2005

1_2_4 వచనము సందీప్ - విజయ్

వచనము

కశ్యపప్రజాపతి తొల్లి పెద్దకాలంబు తపంబు సేసి పుత్త్రకామేష్టిఁ జేసెఁ
గావునఁ గద్రువకు వేవురు కొడుకులను వినతకు నిద్దఱు కొడుకులను వారి
కోరినయట్ల యిచ్చి గర్భంబు లిమ్ముగా రక్షింపంబనిచిన నయ్యిద్దఱును
దద్దయు సంతసిల్లి యున్నంత గర్భంబులు గొండొక కాలంబునకు నండంబు
లైన నయ్యండంబులు ఘృతకుండంబులం బెట్టి రక్షించుచున్నంత నేనూఱేం
డ్లకుఁ గద్రూగర్భాండంబులు తరతరంబ యవిసిన నందు శేష వాసు క్యైరా
వత తక్షక కర్కోటక ధనంజయ కాళియ మణినాగాపూరణ పింజర కైలా
పుత్త్రవామన నీలానీల కల్మాష శబలార్య కోగ్రక కలశపోతక సురాముఖ
దధిముఖ విమలపిండ కాప్త కరోటక శంఖ వాలిశిఖ నిష్ఠానక హేమగుహ
నహుష పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గరపిండక కంబ లాశ్వతర కాళీ
యక వృత్తసంవర్తక పద్మ శంఖముఖ కూష్మాండక క్షేమక పిండారక కర
వీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వపాండర మూషకాద శంఖశిరఃపూర్ణభద్ర
హరిద్ర కాపరాజిత జ్యోతిక శ్రీవహ కౌరవ్య ధృతరాష్ట్ర శంఖ పిండ
వీర్యవ ద్విరజస్సుబాహు శాలిపిండ హస్తిపిండ పిఠరక సుముఖ కౌణపాశన
కుఠర కుంజర ప్రభాకర కుముద కుముదాక్ష తిత్తిరి హలిక కర్దమ బహు
మూలక కర్క రాకర్కర కుండోదర మహోదరు లాదిగాఁగల వేవురు
నాగముఖ్యులు పుట్టిన.

(కశ్యపుడు పుత్రకామేష్టియాగం చేసి వారు కోరిన విధంగా పుత్రులను అనుగ్రహించి గర్భాలను కాపాడమని చెప్పగా అవి తరువాత అండాలుగా మారాయి. కొంతకాలానికి కద్రువకు శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వెయ్యిమంది నాగముఖ్యులు పుట్టారు.)

No comments: