Friday, October 07, 2005

1_2_64 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

అనిన నాగరుడనియనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీసహితుండై
వెలువడి వచ్చి గరుడని దీవించి యథేచ్ఛం జనియె గరుడండును గగన
పథంబునం బఱచి కశ్యపుం గని నమస్కరించి యస్మజ్జననీదాస్యనిరా
సార్థం బురగుల కమృతంబుఁ దేర నరిగెద నిషాదఖాదనంబున
నాఁకలి వోవకున్నయది నా కాహారంబుఁ బ్రసాదింపు మనినఁ గొడుకు కడంకకు
మెచ్చి కశ్యపప్రజాపతి యిట్లనియె.

(అతడు తన భార్యతో బయటకు వచ్చి, గరుడుడిని ఆశీర్వదించి వెళ్లాడు. గరుడుడు ఆకాశమార్గాన తన తండ్రి అయిన కశ్యపుడి దగ్గరకు వెళ్లి, "నా ఆకలి ఇంకా తీరలేదు. ఇంకా ఆహారం అనుగ్రహించండి", అనగా కశ్యపబ్రహ్మ ఇలా అన్నాడు.)

No comments: