Sunday, October 02, 2005

1_2_7 వచనము సందీప్ – విజయ్

ఇట్లు వికలాంగుండై పుట్టిన యనూరుండు వినతకు నలిగి నన్ను సంపూర్ణశరీ
రుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీ సవతికి దాసివై
యేనూఱేం డ్లుండుమని శాపం బిచ్చి యింక నీ రెండవ యండంబు తనకుఁదాన
యవియునంతకు నుండ ని మ్మిందుఁ బుట్టెడు పుత్త్రుండు మహాబలపరాక్రమ
సంపన్నుండు నీదాసీత్వంబు వాపు నని చెప్పి సూర్యరథసూతుండయి యరిగె
వినతయు నయ్యండం బతిప్రయత్నంబున రక్షించుకొని యుండె నంత.

(ఇలా వికలాంగుడిగా పుట్టిన అనూరుడు వినతపై కోపగించుకుని, ‘నాకు సంపూర్ణశరీరం కలిగేంతవరకూ ఆగకుండా అండాన్ని పగులగొట్టిన నీతిలేనిదానివి కాబట్టి నీ సవతికి దాసిగా ఉండు’, అని శపించి, ‘ఈ రెండవ గుడ్డు నుండి పుట్టేవాడు మహాబలవంతుడు. నీ దాసీత్వాన్ని పోగొడతాడు’, అని తెలిపి సూర్యుడికి రథసారథిగా వెళ్లిపోయాడు. వినత కూడా ఆ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండింది. )

No comments: