Saturday, October 08, 2005

1_2_73 వచనము ప్రవీణ్ - విజయ్

వచనము

అమ్మహాశాఖ నవలంబించి తలక్రిందై యాదిత్యకిరణంబులు తమ కాహా
రంబుగాఁ దపంబు సేయుచున్న వాలఖిల్యమహామునిగణంబులం జూచి
యిది భూమిపయిం బడిన నిమ్మునులకు బాధ యగు నని దానిం గఱచికొని
గజకచ్ఛపంబులం గరంబుల నిఱికికొని గరుడండు గగనంబునం బఱచి
తనకు నూఁద నిమ్మగుప్రదేశం బెందునుం గానక గంధమాదనంబునకుం
జని యందుఁ దపంబు సేయుచున్న కశ్యపులం గనుంగొని మ్రొక్కిన.

(ఆ కొమ్మ కిందపడితే, దానికి తలకిందులుగా వేలాడుతూ సూర్యుడి కిరణాలే భోజనంగా తపస్సు చేస్తున్న వాలఖిల్యులనే మునులకు బాధకలుగుతుందని నోటితో ఆ కొమ్మను, కాళ్లతో ఆ అన్నదమ్ములను పట్టుకొని, ఆకాశంలోకి ఎగిరి, వాలడానికి సరైన చోటు ఎక్కడా కనపడక, గంధమాదనపర్వతం దగ్గరకు వెళ్లి, అక్కడ తపస్సు చేస్తున్న కశ్యపుడిని చూసి నమస్కరించాడు.)

No comments: