Monday, October 03, 2005

1_2_16 వచనము ప్రదీప్ - విజయ్

వచనము

మఱియు జ్యేష్ఠయుఁ జంద్రుండును శ్రీయును నుచ్చైశ్శ్రవంబును గౌస్తు
భంబును నైరావణగజంబును నమృతపూర్ణశ్వేతకమండలుధరుం డైన
ధన్వంతరియు నాదిగా ననేకంబు లుద్భవిల్లిన నందుఁ ద్రిభువనవంద్య
యయిన శ్రీదేవియు నిజప్రభాపటలపర్యుదస్త ప్రభాకరగభస్తి విస్తరంబయిన
కౌస్తుభంబును నారాయణువక్షస్స్థలంబున విలసిల్లె. నుచ్చైశ్శ్రవంబను
యుగ్యంబు నైరావణ గజంబును సురరాజయోగ్యంబు లయ్యె నంత నయ్య
మృతంబు నసురులు చేకొనిన.

(ఇంకా, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, ఉచ్చైశ్రవం, కౌస్తుభమణి, అమృతంతో నిండిన కమండలంతో ధన్వంతరి, ఐరావణం మొదలైనవి పుట్టగా లక్ష్మీదేవినీ, కౌస్తుభాన్నీ విష్ణువు తన వక్షఃస్థలంలో నిలుపుకున్నాడు. ఉచ్చైశ్రవాన్నీ, ఐరావణాన్నీ ఇంద్రుడు స్వీకరించాడు. అప్పుడు రాక్షసులు అమృతాన్ని తీసుకోగా.)

No comments: