Tuesday, October 04, 2005

1_2_17 కందము కృష్ణ - విజయ్

కందము

నారాయణుండు కృత్రిమ
నారీరూపమునఁ తన్మనంబుల కతి మో
హారంభకారుఁడై యమ
రారులచేఁ గ్రమ్మఱంగ నమృతము గొనియెన్.

(అప్పుడు విష్ణువు మోహినీరూపం ధరించి, రాక్షసులకు మోహం కలిగించి, వారి నుండి అమృతాన్ని గ్రహించాడు.)

No comments: