Tuesday, October 04, 2005

1_2_18 వచనము కృష్ణ - విజయ్

వచనము

ఇట్లుపాయంబున నసురుల వంచించి యమృతంబుగొని విష్ణుదేవుండు దేవ
తల కిచ్చిన నయ్యమృతంబు దేవత లుపయోగించుచో దేవరూపంబు దాల్చి
రాహువు వేల్పులబంతి నయ్యమృతం బుపయోగించుచున్నఁ దత్సమీపంబున
నన్ను చంద్రాదిత్యులు వాని నెఱింగి నారాయణునకుం జెప్పిన నయ్యమృతంబు
వాని కంఠబిలంబు సొరకముందఱ.

(ఇలా అసురులను వంచించి విష్ణువు అమృతాన్ని దేవతలకివ్వగా వారు దాన్ని తాగేటప్పుడు రాహువు దేవతారూపంలో అది తాగబోగా సూర్యచంద్రులు గుర్తించి విష్ణువుకు చెప్పారు. విష్ణువు ఆ అమృతం రాహువు గొంతులోకి దిగకముందే.)

No comments: