Wednesday, October 05, 2005

1_2_32 వచనము కృష్ణ - విజయ్

వచనము

అని యిట్లిద్దఱు నొండొరులకు దాసీత్వంబు పణంబుగా నొడివి పన్నిదంబు
సఱచిన వినతి యయ్యశ్వంబు డాసి చూతము రమ్మనినఁ గద్రువయు నిప్పుడు
ప్రొద్దులేదు ఱేపకడయ చూత మని యిద్దఱు మగుడి వచ్చితమ నివాసంబుల
కుం బోయియున్నయప్పుడు.

(అలా వారు పందెం వేసుకున్నారు. వినత కద్రువతో ఆ గుర్రం దగ్గరకు వెళ్లి చూసివద్దాము అనగా కద్రువ, 'ఇప్పుడు కాదు. పతిసేవకి సమయమైంది. రేపు ఉదయమే చూద్దాము', అన్నది. ఇద్దరూ తిరిగి వారి నివాసాలు చేరుకున్నారు.)

No comments: