Wednesday, October 05, 2005

1_2_36 వచనము కృష్ణ - విక్రమాదిత్య

వచనము

అందు శాపానుభవభీతచిత్తుండై కర్కోటకుం డనువాఁ డు తల్లి పంచిన
రూపంబున నుచ్చైశ్శ్రవంబువాలంబు నీలంబుగాఁ బట్టి వ్రేలుచున్న మఱు
నాఁడు ఱేపకడయ కద్రువయు వినతయుం జని యత్తురంగంబుఁ జూచి
వినత యోటుపడి కద్రువకు దాసియై నోసిపనులు సేయుచున్నంతఁ బంచశత
వర్షంబులు నిండి రెండవయండం బవిసిన నందు.

(శాపానికి భయపడి కర్కోటకుడనే పాము, కద్రూవినతలు మరునాడు గుర్రాన్ని చూసేటప్పుడు, దాని తోక పట్టుకొని మచ్చలా కనపడేట్లు వేలాడటం వల్ల వినత పందెం ఓడిపోయి కద్రువకు దాసిగా పనిచేయసాగింది. కొంతకాలానికి వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలి.)

No comments: