Thursday, October 06, 2005

1_2_45 వచనము విజయ్ - కృష్ణ

వచనము

ఒక్కనాఁడు సప్తమారుతజవంబున సప్తాశ్వమండలంబుదాఁక నెగసిన నమ్మా
ర్తాండు చండకిరణంబుల వేఁడిమి దాఁకి మాఁడి గరుడని వీపుననున్న యుర
గులు దొరఁగి నేలంబడి మూర్ఛవోయినం జూచి కద్రువ గడునలిగి గరుడ
నిం బదరి యతిభక్తి నింద్రు నారాధించి.

(ఒకరోజు గరుడుడు సూర్యమండలం వరకూ పైకెగరగా తీక్ష్ణమైన ఆ కిరణాలవేడికి అతడి వీపుపై ఉన్న పాములు మాడి, కిందపడి మూర్ఛపోగా, కద్రువ కోపంతో గరుత్మంతుడిని నిందించింది. తరువాత ఆమె ఇంద్రుడిని పూజించి.)

No comments: