Thursday, October 06, 2005

1_2_47 వచనము విజయ్ - కృష్ణ

వచనము

అని స్తుతియించి పర్జన్య ప్రసాదంబున మహావృష్టి గొడుకుల పయిం గురి
యించి యయ్యురగుల విగతపరితాపులం జేసి కద్రువ గర్వంబున నుఱక
గరుడని వినతనుం బనులు గొనుచున్నంత నొక్కనాఁడు గరుడండు తల్లి
కిట్లనియె.

(అని ఇంద్రుడి అనుగ్రహంచేత కద్రువ తన కుమారులమీద వాన కురిసేలా చేసి వారికి ఉపశమనం కలిగించి, ఎవరినీ లక్ష్యపెట్టకుండా, వినత చేత, గరుడుని చేత పనులు చేయించుకుంటూ ఉండగా గరుడుడు తల్లితో ఇలా పలికాడు.)

No comments: