Friday, October 07, 2005

1_2_62 వచనము శ్రీహరి - విక్రమాదిత్య

వచనము

అని బ్రాహ్మణస్వరూపంబుఁ జెప్పిన నెఱింగి వినతకు మ్రొక్కి వీడ్కొని
గరుడం డతిత్వరితగతిం బఱచి సముద్రోదరంబున నున్న నిషాదుల ననేక
శతసహస్రసంఖ్యలవారిని బాతాళవివరంబునుం బోని తనకంఠబిలంబుఁ
దెఱచి యందఱ నొక్కపెట్ట మ్రింగిన నం దొక్కవిప్రుం డుండి కుత్తుకకు
దిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి నాకంఠబిలంబున విప్రుండున్న
వాఁడేని వెలువడి వచ్చునది యనిన గరుడని కవ్విప్రుం డిట్లనియె.

(అని వినత చెప్పగా, గరుడుడు ఎగిరి వెళ్లి ఆ నిషాదులందరినీ ఒకేసారి మింగాడు. వారిలో ఒక బ్రాహ్మణుడు ఉండి, తల్లి చెప్పిన విధంగా గొంతుదిగకపోగా, గరుడుడు తన గొంతులో ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే బయటికి రావాలని పలికాడు. ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు.)

No comments: