Friday, October 07, 2005

1_2_71 వచనము శిరీష - విజయ్

వచనము

అందు రోహిణంబను పాదపోత్తమంబు గరుడనిం గని సంభావించి శత
యోజనాయతంబైన మదీయశాఖాపై నుండి యిగ్గజకచ్ఛపంబుల భక్షించి
పొమ్మనిన గరుడండు నట్ల చేయుదునని యమ్మహాశాఖపై నూఁద సమ కట్టి యందు.

(అక్కడ రోహిణం అనే చెట్టు గరుడుడిని గౌరవించి తన కొమ్మపై నిలిచి ఆ ఏనుగును, తాబేటిని తిని వెళ్లమన్నది.)

No comments: