Saturday, October 08, 2005

1_2_75 వచనము ప్రవీణ్ - విజయ్

వచనము

ఇగ్గరుడండు భువనగహితమహారంభుండు మీకు బాధ యగు నని యిత్తరు
శాఖ విడువ నేరకున్నవాఁడు వీనిం గరుణించి మీ రొండుకడ కరుగుం
డనిన వాలఖిల్యులు కశ్యపుప్రార్థనం జేసి దాని విడిచి హిమవంతంబున
కుం జనిరి గరుడండును ముఖనిక్షిప్తశాఖాస్థలితవచనుం డగుచుఁ దండ్రికిట్లనియె.

("గరుత్మంతుడు మీకు బాధకలుగుతుందని మీరున్న కొమ్మని విడువలేకున్నాడు.వీడిని అనుగ్రహించి వేరే చోటికి వెళ్లండి", అనగా ఆ వాలఖిల్యులు కొమ్మని విడిచి హిమాలయాలకు వెళ్లారు. గరుడుడు కశ్యపుడితో.)

No comments: