Friday, October 07, 2005

1_2_67 కందము శ్రీహరి - విజయ్

కందము

తా నలిగి యిచ్చె శాపం
బేనుఁగవై యుండు మని సహింపక వాఁడున్
మానుగఁ గూర్మమ వగు మని
వానికిఁ బ్రతిశాప మిచ్చె వసులోభమునన్.

(తమ్ముడిని ఏనుగువు కమ్మని శపించాడు. అప్పుడు సుప్రతీకుడు అన్నను తాబేలువు కమ్మని శపించాడు.)

No comments: