Friday, October 07, 2005

1_2_69 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

చఱచి యొకచేతఁ గూర్మముఁ
బెఱచేత గజంబుఁ బట్టి పెనఁచి ఖగేంద్రుం
డిఱికికొని గగనవీథిం
బఱచె వియచ్చరవిమానపంక్తులు దూలన్.

(ఒక కాలితో ఏనుగును, ఇంకొక కాలితో తాబేటిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు.)

No comments: