Wednesday, August 09, 2006

1_6_163 చంపకమాల జ్యోతి - విజయ్

చంపకమాల

అనుపమనిత్యసత్యరతు లై వినయాన్వితు లైన పాండునం
దనులకు ధర్మమూర్తులకు ధర్ము వెఱుంగక యిట్టు లెగ్గు సే
సిన ధృతరాష్ట్రజాధము నశేషసుహృత్సుతబంధుదాహసూ
చనమయి లక్కయి ల్లతికృశానుశిఖాహతిఁ గ్రాఁగెఁ గ్రక్కునన్.

(పాండవులకు కీడు చేసిన దుర్యోధనుని మిత్రులు, బంధువులు కాలటాన్ని సూచిస్తూ లక్కయిల్లు కాలిపోయింది.)

No comments: