సీసము
రాజ్యపదస్థుం డరాజ్యపదస్థులఁ
బక్షబలాఢ్యుఁ డపక్షబలుల
విపులార్థవంతుండు విగతార్థసార్థుల
నవసరం బెఱిఁగి వాఁ డశ్రమమున
దూష్యులఁ దుదిదాఁక దూషించు మనల న
న్నిష్ఠురునకు నది నీతిగాదె
కావున నొరు లెఱుంగకయుండఁ గడు నమ్మి
నట్టుల యుండుద మని దినంబు
తేటగీతి
లెల్ల వేఁటలాడుచు రాత్రులెల్ల నుద్య
తాయతాయుధహస్తు లై యనుదినంబు
నప్పురోచను వంచించి యనఘు లుండి
రప్రమాదు లై పాండవు లప్పురమున.
(దుర్యోధనుడు మనలను సమయం చూసి తుదముట్టించటానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి నమ్మినట్లే ఉందాము - అని పాండవులు పగటిపూట వేటాడుతూ, రాత్రిపూట ఆయుధాలు చేత ధరించి అప్రమత్తులై ఆ వారణావతంలో ఉన్నారు.)
Wednesday, August 02, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment