Wednesday, August 02, 2006

1_6_156 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇప్పాపగృహప్రకారంబున మన మెఱుంగుట పురోచనుం డెఱింగెనేని దుర్యోధనునియోగంబు విఫలంబగునట్లు గాకుండ శీఘ్రకారుల మై దీని దహించిన నక్కడ భీష్మువిదురులు విని కోపించినం గురుకుల సముద్ర క్షోభం బగు మఱి దాహభయంబున మన మొండుగడకుం బోయిన నెఱింగి మనయంతరంబ రోయుచు నద్దురాత్ముండు దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నె ట్లనిన.

(ఈ ఇంటి సంగతి మనకు తెలిసిందని పురోచనుడికి తెలిస్తే దుర్యోధనుడి ఆజ్ఞ విఫలమవుతుంది. మనం ఇంటిని దహిస్తే, భీష్మవిదురులు ఇది విని కోపిస్తే హస్తినాపురంలో సంక్షోభం కలుగుతుంది. అలా కాక ఇల్లు కాలుతుందని మనం వేరే చోటికి వెడితే మనం దాగిన చోటునే వెదుకుతూ మళ్లీ మనకు కీడు చేస్తాడు.)

No comments: