Wednesday, August 02, 2006

1_6_158 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రంబంతయు నిమ్ముగా నెఱింగి కడువిశ్వాసి నొక్కఖనకు నతి కుశలుం బాండవుల పాలికిం బుత్తెంచిన వాఁడును వచ్చి రహస్యంబునం బాండవులం గని తన్ను నమ్మునట్లుగా విదురుసాభిజ్ఞానవచనంబు లెఱింగించి యీకృష్ణచతుర్దశినాఁటిరాత్రి పురోచనుండు లక్కయింట దహనంబు దరికొల్పుం గావున నిందుండి మీకు వెలువడిపోవునట్టియుపాయంబు మారాజు నియోగంబునం జేయవచ్చితి నని చెప్పి లక్కయిల్లు వెలువడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెఱుంగకుండం జేసి వారల కెఱింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి యెఱింగి యుండు నంత.

(విదురుడు ఒక ఖనకుడిని పాండవుల దగ్గరకు పంపగా అతడు - రానున్న కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి పురోచనుడు ఈ లక్కయింటిని తగులబెడతాడు - అని చెప్పి ఆ లక్కయింటినుండి ఒక సొరంగాన్ని తవ్వి పాండవులకు తెలియజేశాడు. భీముడు దానిని పరిశీలించాడు.)

No comments: