Wednesday, August 02, 2006

1_6_159 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధనదానములను బ్రియభో
జనదాహములను విశిష్టసద్ద్విజతతులం
దనుపుచు నుండఁగఁ దత్పుర
మున షణ్మాసములు భరతముఖ్యుల కరిగెన్.

(పాండవులు ధనదానాలు, భోజనదానాలు చేస్తూ వారణావతంలో ఆరునెలలు గడిపారు.)

No comments: