వచనము
ఆ కృష్ణచతుర్దశినాఁడు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల నిష్టాన్న పాన దానంబులం దుష్టి చేసి దేవపూజ గావించి యున్నెడం బురోచనుపంపిన నిషాదవనిత సపుత్త్రయైన బహువిధవన్యమూలఫలంబులం దెచ్చి యిచ్చుచుం గుంతీదేవిం బాయక సేవించి పాండవ కృత్యంబులు నిత్యంబును నెఱింగించు చుండెడు నది నాటిరాత్రి యుత్సవంబునం గాలచోదిత యై తానునుం దన యేవురు కొడుకులు నధిక మధుపాన మదంబున మెయి యెఱుంగక లక్కయింటి పక్కంబున నిద్రవోయిన నర్ధరాత్రంబునప్పుడు భీముండు మేల్కని పురోచనుకంటె ముందఱఁ దాన యుత్సహించి వానిశయనగృహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి చెచ్చెరఁ దల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని కనిచి యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున కశనంబు సేసి ఖనకునకుం దమకుశలమనం బెఱింగించి బిలప్రవిష్టుం డయి కుంతిని ధర్మార్జుననకులసహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని చనునప్పుడు.
(పురోచనుడు పంపిన ఒక బోయస్త్రీ, తన కొడుకులతో కుంతీదేవిని సేవిస్తూ పాండవులు చేసే పనులను పురోచనుడికి తెలియజేస్తూ ఉండేది. ఆ కృష్ణచతుర్దశినాడు వాళ్లు ఆ లక్కయింటిపక్కన నిద్రించగా, భీముడు పురోచనుడికంటే ముందే వాడి పడకటింటి వాకిటికి నిప్పు అంటించాడు. వెంటనే తల్లిని, అన్నను, తమ్ములను ఆ సొరంగంలోకి పంపి, లక్కయింటిని తగులబెట్టాడు. విదురుడు పంపిన ఖనకుడికి తమ క్షేమాన్ని తెలిపి సొరంగంలో ప్రవేశించాడు. అందరినీ ఆ సొరంగంలోనుండి బయటికి తోడ్కొని వెళ్లేటప్పుడు.)
Wednesday, August 02, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment