Wednesday, August 09, 2006

1_6_161 సీసము + ఆటవెలది జ్యోతి - విజయ్

సీసము

కడునిద్రఁ గానక తొడరుచు వడిగొని
        నడవంగ నేరక తడయుచున్న
నెఱిఁగి చెచ్చరఁ దల్లి నఱకట నిడి ధర్మ
        సుత విజయులఁ దనవితతబాహు
యమళంబు నెక్కించి యముల నుత్సంగంబు
        లెక్కించుకొని భీముఁ డక్కజముగ
నరిగెడు రయమునఁ దరులు సాల్పడి మ్రొగ్గఁ
        బదఘట్టనంబులఁ జదిసి ఱాలు

ఆటవెలది

నుఱుము గాఁగ నిట్లు నెఱయంగ సత్త్వంబు
మెఱసి రాతి రెల్ల నుఱక పవన
తనయుఁ డరిగెఁ బవలు సనినట్లు చీఁకటి
యనక ముండ్లు గండ్లు ననక తెరలి.

(భీముడు తల్లిని, అన్నదమ్ములను ఎత్తుకొని రాత్రిని లెక్కచేయకుండా నడిచివెళ్లాడు.)

No comments: