Wednesday, August 09, 2006

1_6_168 వచనము జ్యోతి - విజయ్

వచనము

అంత విదుర ప్రేషితుం డయిన ఖనకుండు పౌరులం గలసి భస్మంబు వాయఁ ద్రోచువాఁడపోలె నెవ్వరు నెఱుంగకుండఁ దనచేసిన బిలంబు ద్వారంబు గప్పి లక్కయింట నొక్కనిషాదవనిత యేవురుగొడుకులతో దగ్ధ యగుట యెఱింగి గజపురంబునకుం జని తద్వృత్తాంతంబును బాండవుల కుశలగమనంబును విదురునకుం జెప్పె నిట వారణావతమ్మున వారెల్ల నిట్టిదారుణంబు దుర్యోధనకారితంబకా నెఱింగి శోకించి కుంతీపాండవులపంచత్వంబు ధృతరాష్ట్రునకుం జెప్పి పుచ్చిన.

(విదురుడు పంపిన ఖనకుడు వారణావత నగర ప్రజలతో కలిసి బూడిదను ఆవలికి తోసేవాడిలా ప్రవర్తించి ఎవ్వరూ చూడకుండా తాను తవ్విన సొరంగద్వారాన్ని కప్పివేశాడు. లక్కయింటిలో కాలిపోయింది బోయెత, ఆమె కొడుకులు అని తెలుసుకొని, హస్తినాపురానికి వెళ్లి, విదురుడికి పాండవుల క్షేమం గురించి తెలియజేశాడు. వారణావత ప్రజలు - ఈ ఘోరకృత్యం దుర్యోధనుడు చేసిందే - అని దుఃఖించి కుంతీ పాండవుల మరణవార్తను ధృతరాష్ట్రుడికి చెప్పి పంపారు.)

No comments: