Wednesday, August 09, 2006

1_6_167 మత్తేభము జ్యోతి - విజయ్

మత్తేభము

బలవంతుల్ భరతాన్వయస్థితికరుల్ భాస్వద్భుజావీర్యని
ర్దళితారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్ పాండవే
యులు నిష్కారణ మిట్లు వచ్చి ధృతరాష్ట్రోపాయమాయోత్థిత
జ్వలనజ్వాలలఁ గ్రాఁగిరే యనుచు సంజాతార్తు లై రెంతయున్.

(భూభారం వహించగల పాండవులు ధృతరాష్ట్రుడి కపటోపాయం వల్ల మంటల్లో మాడిపోయారు కదా అని దుఃఖించారు.)

No comments: