Thursday, August 10, 2006

1_6_172 వచనము జ్యోతి - విజయ్

వచనము

అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖు లయి మారుతమార్తాండమరీచిగోచరంబు గాని గహనంబున నరుగుచు నధికక్షుత్పిపాసాపరవశు లయి నడవనోపకయున్న నెప్పటియట్ల యందఱనెత్తికొని వాయుతనయుండు వాయువేగంబునఁ జని సాయాహ్నంబున నొక్కవటమహీజాతశీతలశిలాతలంబున నునిచి దాని యగ్రవిటపం బెక్కి నీరారయుచున్నంత ననతి దూరంబున.

(పాండవులు గంగానదిని దాటి దక్షిణం వైపు సాగారు. ఆకలిదప్పులకు లోనై దట్టమైన అడవిలో నడవలేకపోగా భీముడు వారిని ఒక మఱ్ఱిచెట్టు కింద ఉన్న చల్లని రాతిప్రదేశాన ఉంచి, ఆ చెట్టు చివరికొమ్మనెక్కి నీళ్లకోసం వెదుకుతూ ఉండగా.)

No comments: