Thursday, August 10, 2006

1_6_176 ఉత్పలమాల జ్యోతి - విజయ్

ఉత్పలమాల

అంబురుహాప్తుఁ డస్తశిఖరాంతరితుం డగుడున్ సమస్త జీ
వంబులు నెల్లచో నిజనివాసముఁ బొందునెడం దమిస్రపుం
జంబులపోలె వెల్వడియె శైలవిశాలగుహాలినుండి నా
గంబులయూధముల్ సరసఘాసపరిగ్రహణోత్సుకంబు లై.

(అన్ని ప్రాణులు తమ నివాసాలకు పోతుండగా ఏనుగుల గుంపులు గడ్డిని తినేందుకు కొండగుహలనుండి వెలుపలికి వచ్చాయి.)

No comments: