Friday, August 11, 2006

1_6_187 ఉత్పలమాల జ్యోతి - విజయ్

ఉత్పలమాల

ఇందుల కిమ్మెయిన్ మనుజు లెన్నఁడు వత్తురె వత్తురేని యా
నందముఁ బొంది నిర్భయమున్ శయనింతురె యిట్లు వంటయిల్
కుందెలు సొచ్చె వేగ చని కోమలి వారలఁ జంపి తెచ్చి నా
కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండముల్.

(ఇక్కడికి మానవులు ఎప్పుడైనా వస్తారా? వచ్చినా నిర్భయంగా ఇలా నిద్రిస్తారా? వంటయింటిలోకి కుందేలు వచ్చింది. వెళ్లి వాళ్లను చంపి నాకు వండి పెట్టు - అని చెల్లెలితో చెప్పాడు.)

No comments: