Friday, August 11, 2006

1_6_186 వచనము జ్యోతి - విజయ్

వచనము

తత్సమీపంబున బాలసాలతరుషండమండపంబుననుండి హిడింబుఁ డను నొక్కరాక్షసుండు వారి దవ్వులం జూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్గి నీరసవన్యమృగమాంసఖాదనజాతనిర్వేదనపరుండ నయి పెద్దకాలంబునకు మానవమాంసం బాస్వాదింపంగంటి నని తన చెలియలి హిడింబ యనుదానిం బిలిచి యి ట్లనియె.

(ఆ ప్రదేశానికి దగ్గరగా లేత మద్దిచెట్ల మండపంలో ఉన్న హిడింబుడనే రాక్షసుడు వాళ్లను చూసి, చాలా కాలం తరువాత మానవమాంసం రుచి చూసే అవకాశం కలిగిందని తన చెల్లెలు హిడింబను పిలిచి ఇలా అన్నాడు.)

No comments: