Friday, August 11, 2006

1_6_189 మత్తేభము జ్యోతి - విజయ్

మత్తేభము

వనజాతాయతనేత్రు నున్నతబృహద్వక్షఃస్థలున్ సింహసం
హననుం బాండవసింహమున్ హృదయజన్మాకారు నుద్యన్మహా
శనికల్పస్థిరబాహుఁ జూచుచు మనోజాతాగ్నిసంజాతవే
దన యై రాక్షసి కామరూపధర మర్త్యస్త్రీస్వరూపంబుతోన్.

(భీముడిని చూసి మోహించి, మానవకాంత రూపంలో.)

No comments: