Friday, August 11, 2006

1_6_193 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

జననుత యేను హిడింబుం
డను రక్కసుచెలియలం బ్రియంబున నినుఁ జూ
చినయప్పటఁగోలెను గడు
మనోభవనిపీడ్యమానమానస నయితిన్.

(నేను హిడింబుడనే రాక్షసుడి చెల్లెలిని. నిన్ను చూసింది మొదలు మన్మథబాధకు గురి అయ్యాను.)

No comments: