సీసము
ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు
వారుణాస్త్రమున దుర్వారజలము
ననిలబాణంబున నధికానిలంబును
మేఘాస్త్రమున మహామేఘచయముఁ
బుట్టించు మఱియును భూమిబాణంబున
భూప్రవిష్టుండగు భూరిఘోర
శైలబాణంబున శైలరూపము దాల్చు
వీరుఁ డదృశ్యాస్త్రవిద్యపేర్మిఁ
తేటగీతి
దా నదృశ్యదేహుం డగుఁ దత్క్షణంబ
హ్రస్వుఁడగు దీర్ఘుఁడగు సూక్ష్ముఁ డగు రయంబు
తోడ రథమధ్యగతుఁ డగు ధూర్గతుండు
నగు మహీతలగతుఁ డగు నద్భుతముగ.
(చాలా అస్త్రాలు ప్రదర్శించాడు.)
Sunday, April 23, 2006
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చక్కని పద్యాన్ని పంచుకున్నారు. దీనికి అర్థం కూడా మీ మాటలలో వివరిస్తే మరింత అందం చేకూరేది కదండీ!
Post a Comment