Wednesday, August 09, 2006

1_6_170 వచనము జ్యోతి - విజయ్

వచనము

మఱియు గాంధారిం దొట్టి దేవీజనులయాక్రందనధ్వను లంతఃపురంబున నెగసె భీష్మాదికురువృద్ధులును విప్రులుం బౌరులును శోకాక్రాంతు లయిరి విదురుండు పాండవులకుశలస్థితి యెఱింగియు నెఱుంగనియ ట్లందఱం గలసి దుఃఖితుండపోలె నుండె నంత ధృతరాష్ట్రుండు గొడుకులుం దానును బాంధవులును గుంతీపాండవుల కుదకదానంబు నేసి సంస్కారాదిపరలోకక్రియలు గంగాతీరంబునం జేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల నపారధనంబులతోడం బుచ్చిన.

(పెద్దలందరూ దుఃఖించారు. విదురుడు పాండవుల క్షేమం తెలిసినా దుఃఖించినట్లు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కుంతీ పాండవులకు గంగాతీరాన పరలోకక్రియలు జరిపించటానికి ఏర్పాట్లు చేయించాడు.)

No comments: