Thursday, August 10, 2006

1_6_178 కందము జ్యోతి - విజయ్

కందము

త్రిభువనసామ్రాజ్యశ్రీ
ప్రభుఁ డగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున
ట్లభిరూక్షతలంబున ని
ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుం డై.

(ముల్లోకాలకు ప్రభువైన ధర్మరాజు సామాన్యమానవుడిలా నేలమీద నిద్రించటమా!)

No comments: