Thursday, August 10, 2006

1_6_179 సీసము + ఆటవెలది జ్యోతి - విజయ్

సీసము

కుంతిభోజాధిపుకూఁతురు వసుదేవు
        చెలియలు మఱియు విచిత్రవీర్యు
కోడలు కౌరవకులవిభూషణుఁ డైన
        పాండుమహాదేవి పరమధర్మ
పరు లైన కొడుకులఁ బడసినయది పుష్ప
        సుకుమారతరమూర్తి శుచిపరార్థ్య
శయనతలంబున శయనించియును నిద్ర
        వోవనియది డప్పిఁ బొంది కటికి

ఆటవెలది

నేలఁ గండ్లు లొత్త నిద్ర వోయిన యది
తల్లికంటె నిద్రఁ దగిలి సుతులు
వాలుమృగములున్న వన మని వగవక
మఱచియుండి రేమి మాడ్కి యొక్కొ.

(కుంతీదేవి కటికనేల మీద నిద్రపోయింది. తల్లికంటే గాఢనిద్రలో ఉన్న కొడుకులు ఇది క్రూరమృగాలు ఉండే అడవి అని ఆలోచించకుండా నిద్రపోతున్నారు. ఇదేమి చిత్రమో కదా!)

No comments: