Friday, August 11, 2006

1_6_191 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

రమణి నిజభ్రాతృనియో
గముఁ దలఁపక యపుడు భీముఁ గదిసెఁ బతిస్నే
హమ కామినులకు బలవం
తము పెఱనెయ్యములు వేయుఁ దత్సదృశములే.

(హిడింబ తన అన్న ఆజ్ఞను మరచి భీముడిని చేరుకున్నది. కాంతలకు భర్తమీది స్నేహమే బలమైనది. మిగిలిన స్నేహాలు వెయ్యి అయినా దానితో సమానాలు కావు.)

No comments: