Sunday, August 28, 2005

1_1_101 వచనము సందీప్ - విజయ్

వచనము

కావున నా కశక్యంబు నీయిచ్చిన శాపంబు గ్రమ్మఱింపు మనిన నుదంకుం
డట్లేని నీకు నల్పకాలంబున శాపమోక్షం బగు నని పౌష్యునకు ననుగ్ర
హించి మగుడి నేఁడ పోయి గురుపత్నికిఁ గుండలంబు లీఁగంటినని సంతో
షించి చనువాఁ డెదుర నొక్క జలాశయంబు గని శుచిప్రదేశంబునఁ దనచేతి
కుండలంబులు పెట్టి యాచమించుచున్నంతఁ దనతోడన వచ్చి తక్షకుండు
నగ్నవేషధరుండై యక్కుండలంబులు గొని పాఱిన నుదంకుండును వాని
పిఱుందన పాఱి పట్టికొనుడు.










(కాబట్టి శాపం తొలగించటం నాకు శక్యం కాదు, నీ శాపమే తొలగించమని పౌష్యుడు అన్నాడు. అప్పుడు ఉదంకుడు, "నీకు కొద్ది కాలంలోనే విముక్తి కలుగుతుంది" అని పౌష్యుడిని అనుగ్రహించి తిరిగివెడుతుండగా అతడికి ఒక సరస్సు కనిపించింది. కుండలాలను ఒక శుభ్రమైన చోట ఉంచి ఆచమనం చేస్తుండగా తక్షకుడు నగ్నరూపంలో వచ్చి కుండలాలు దొంగిలించి పరుగెత్తసాగాడు. ఉదంకుడు కూడా తక్షకుడి వెనుకనే పరుగెత్తి అతన్ని పట్టుకొన్నాడు.)

No comments: