అనినం బౌష్యుం డిట్టి మహాత్మున కీఁగాంచితిఁ గృతార్థుండ నైతినని సంతసిల్లి
యుదంకున కిట్లనియె నయ్యా మదీయధర్మపత్ని యక్కుండలంబులు
దొడిగి యున్నయది మద్వచనంబున వాని నిప్పించుకొ మ్మనిన నుదంకుం
డంతఃపురమునకుఁ జని పౌష్యుమహాదేవిం గానక క్రమ్మఱి పౌష్యు పాలికి
వచ్చి నీదేవి నందులం గాన నీవ యక్కుండలంబులు దెప్పించి యిమ్మనినఁ
బౌష్యుం డిట్లనియె.
(ఇలాంటి మహాత్మునికి ఇవ్వగలిగే వాడిని అయ్యాను అని పౌష్యుడు సంతోషించి, "నా భార్య వాటిని ధరించి ఉంది. నా మాటగా చెప్పి అవి గ్రహించండి" అనగా ఉదంకుడు అంతఃపురానికి వెళ్లి, పౌష్యుడి మహారాణి కనపడక, తిరిగివచ్చి రాజుతో, "నీ దేవి అక్కడ కనపడలేదు. నీవే ఆ కుండలాలు తెప్పించి ఇవ్వ", మనగా పౌష్యుడు ఇలా అన్నాడు.)
Saturday, August 27, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment