Saturday, August 27, 2005

1_1_97 వచనము విజయ్ - సందీప్

అనిన విని యుదంకుం డప్పుడు దలంచి యావృషభగోమయ భక్షణానంతరంబున
నాచమింపమినైన నాయశుచిభావంబునఁ గాకేమి యప్పరమ
పతివ్రత మదీయదృష్టిగోచర గాకున్న దయ్యె నని పూర్వాభిముఖుండయి
శుద్ధోదకంబులం బ్రక్షాళితపాణిపాదవదనుండయి యాచమించి పౌష్యానుమతంబున
నద్దేవియొద్దకుం జనిన నదియును నమ్మహామునికి నమస్కరించి కుండలమ్ము లిచ్చి యిట్లనియె.









(అప్పుడు ఉదంకుడు ఆలోచించి, గోమయభక్షణానంతరం ఆచమనం చేయకపోవటమే తన అపవిత్రతకు కారణమని తలచి, ఆచమనం చేసి, పౌష్యుడి అనుమతితో అతడి రాణి వద్దకు పోగా, ఆమె ఉదంకుడికి నమస్కారం చేసి, కుండలాలు ఇచ్చి ఇలా అన్నది.)

No comments: