Sunday, August 28, 2005

1_1_108 వచనము సందీప్ - విజయ్

వచనము

అని యి ట్లురగపతుల నెల్ల స్తుతియించి యందు సితాసితతంతుసంతాన
పటంబు ననువయించుచున్నవారి నిద్దఱ స్త్రీలను ద్వాదశారచక్రంబుం బరి
వర్తించుచున్నవారి నార్వురఁ గుమారుల నతిప్రమాణతురంగంబు నెక్కిన
వాని మహాతేజస్వి నొక్క దివ్యపురుషుం గని విపులార్థవంతంబులైన మం
త్రంబుల నతిభక్తియుక్తుండై స్తుతియించినం బ్రసన్నుండై యద్దివ్యపురు
షుం డయ్యుదంకున కిట్లనియె.









(ఇలా ఆ రాజులను స్తుతించి, అక్కడ తెల్లని, నల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను, పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను, ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూసి, అర్థవంతాలైన మంత్రాలతో అతడిని స్తుతించగా అతడు ప్రసన్నుడై ఉదంకుడితో ఇలా అన్నాడు.)

No comments: