అనిన నుదంకుం డట్ల చేయుదునని యద్దేవి వీడ్కొని పౌష్యుపాలికిం
బోయిన నతం డయ్యా! నీ వతిథివి మాయింటఁ గృతభోజనుండవై పొమ్మని
క్షణియించిన నొడంబడి యుదంకుండు గుడుచుచో నన్నంబు కేశదుష్టంబైన
రోసి కరం బలిగి యి ట్లపరీక్షితంబైన యశుద్ధాన్నంబు పెట్టినవాఁడ వంధుండ
వగు మని శాపం బిచ్చిన నల్గి యల్పదోషంబున నాకు శాపం బిచ్చిన
వాఁడవు నీ వనపత్యుండ వగుమని ప్రతిశాపం బిచ్చిన నుదంకుండు నేననపత్యుండఁ గా
నోప దీనిఁ గ్రమ్మఱింపు మనినఁ బౌష్యుండిట్లనియె.
(ఉదంకుడు అలాగే చేస్తానని పలికి, రాణి వద్ద సెలవు తీసుకొని, పౌష్యుడి దగ్గరకు వెళ్లగా, అతడు ఉదంకుడిని భోజనం చేసి వెళ్లవలసిందని కోరాడు. ఉదంకుడు సమ్మతించి భోజనం చేస్తుండగా, అన్నంలో వెండ్రుక ఉండటంచేత, అది అపవిత్రం అయిందనే కోపంతో , "పరీక్షంచకుండా అపవిత్రమైన అన్నం పెట్టినందుకు గుడ్డివాడవు అవుతావు గాక", అని శాపమిచ్చాడు. అప్పుడు పౌష్యుడు, "చిన్నతప్పుకు నన్ను శపించావు కాబట్టి నీకు సంతానం లేకపోవు గాక" అని ప్రతిశాపమిచ్చాడు. "సంతానం లేకపోవటాన్ని నేను భరించలేను. శాపం ఉపసంహరించ", మని ఉదంకుడు అనగా పౌష్యుడు ఇలా పలికాడు.)
Saturday, August 27, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment