Sunday, August 28, 2005

1_1_110 వచనము సందీప్ - విజయ్

వచనము

ఉదంకుండు గరంబు సంతసిల్లి యిన్నాగకులం బెల్ల నాకు వశం బగునట్టు
లుగ ననుగ్రహింపు మనిన నప్పురుషుం డట్లేని నీయశ్వకర్ణరంధ్రాధ్మానంబు
సేయు మనిన వల్లె యని తద్వచనానురూపంబు సేయుడుఁ దత్క్షణంబ.





(ఉదంకుడు సంతోషించి, నాగకులం మొత్తం తన వశమయ్యేలా అనుగ్రహించమని కోరాడు. ఆ దివ్యపురుషుడు అప్పుడు, "అలాగైతే ఈ గుర్రం చెవిలో ఊద"మని అన్నాడు. ఉదంకుడు అలాగే చేయగా.)(మూలంలో ఆ దివ్యపురుషుడు ఉదంకుడికి గుర్రం అపానంలో ఊదమని చెప్పినట్లు ఉంది.)

No comments: