అని సరమ యదృశ్యయైన నతివిస్మితుండై జనమేజయుండు కొన్నిదినంబు
లకు దీర్ఘసత్త్రంబు సమాప్తంబు సేసి హస్తిపురంబునకుం జని యందు
సుఖంబుండి యొక్కనాఁడు దేవశునివచన ప్రతీకారార్ధంబు శాంతిక పౌష్టిక
క్రియలు నిర్వర్తింప ననురూప పురోహితు నన్వేషించుచు ననేక మునిగణా
శ్రమంబులకుం జని యెక్క మునిపల్లెం గని యందు శ్రుతశ్రవసుండను
మహామునిం గని నమస్కరించి యిట్లనియె.

(అని సరమ అదృశ్యమవగా జనమేజయుడు విస్మితుడయాడు. కొన్ని రోజులకు యజ్ఞాన్ని పూర్తిచేసి, హస్తినాపురానికి వెళ్లి, కొంతకాలానికి, సరమ మాటలకు ఉపశాంతి జరిగేలా కర్మలు చేయగల పురోహితుని వెదుకుతూ, శ్రుతశ్రవసుడనే ముని వద్దకు చేరి ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment